జన్నారంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ..
దేశభక్తిని చాటుకున్న విద్యార్థులు
జన్నారం, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తి భావనను చాటిచెప్పేలా జన్నారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో స్థానిక ధర్మారం చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
చిన్నతనం నుంచే పిల్లల్లో జాతీయ భావాలను పెంపొందించడంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు రమేష్‌గౌడ్, జగన్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకుడు బద్రి నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, కిష్టాపూర్ సర్పంచ్ వాసాల నరేష్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్, జిల్లా నాయకుడు గోలి చందు, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కందుల రమేష్, లక్ష్మీరాజం, పొనకల్ ఉపసర్పంచ్ అప్పాల జలపతి, బూత్ అధ్యక్షుడు యుగంధర్, పట్టణ అధ్యక్షుడు సూర్యం, నేతలు సత్తయ్య, వేయికండ్ల రవి, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
