పత్తికొండ ఫిబ్రవరి 13( ఆంధ్రప్రభ) మండల పరిధిలోని పందికొన గ్రామంలో శుక్రవారం ఉదయం హెచ్ ఎన్ ఎస్ ఎస్ (HANDRI NEEVA SUJALA SRAVANTHI IRRIGATION PROJECT ) కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి విద్యార్థి తులసి గౌడ్ గల్లంతు అయ్యాడని పందికొన రెవెన్యూ అధికారి పత్తికొండ తాసిల్దార్ కు సమాచారం ఇవ్వడంతో రిఫరెన్సులో తెలపడంతో కాలువలో పడిన మైనర్ బాలుడిని గుర్తించేందుకు ఎం డి ఆర్ ఎఫ్ దళాన్ని రెస్క్యూ టీం ను పంపించాలని తాసిల్దార్ కోరారు. స్పందించిన అధికారులు బాలుడు పడిపోయిన ప్రాంతానికి వెళ్లి పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది వెతికిన గుర్తించబడలేదు. బాలుడుని గుర్తించేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాన్ని నియమించాలని తాసిల్దార్ కోరారు.
గల్లంతైన విద్యార్థి డోన్ పట్టణానికి చెందిన ఈడిగ దామోదర్ గౌడ్, తల్లి రాజేశ్వరి సంతానమైన తులసి గౌడ్ ఆరవ తరగతి చదువుతున్నాడని తెలిపారు. ఈ విద్యార్థి గత వారం క్రితం పందికొన గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమానికి తులసి గౌడ్ వాళ్ళ పిన్ని ఇంటికి వచ్చాడని తెలిపారు. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వచ్చి కాలువలో కాళ్లు చేతులు కడుక్కోవడానికి వెళ్లాడని ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు.