హైదరాబాద్ : గులాబీ దళపతి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్లాంటేషన్‌పంజాగుట్టలోని పార్కులో మొక్కలు నాటిన పార్టీ బీఆర్ఎస్ శ్రేణులుహైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, హరిత ప్రేమికుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పంజాగుట్టలోని జలగం వెంగళరావు పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. అందరం కలిసి సస్యశ్యామలమైన, పచ్చదనాల తెలంగాణను సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ రోజు పచ్చదనం కోసం అడుగులు వేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.