అంతర్జాతీయ వేదికపై గుంటూరు కీర్తి…

అంతర్జాతీయ వేదికపై గుంటూరు కీర్తి…

ప్రతిష్టాత్మక ‘జీ ఈ ఎం ‘ అవార్డును అందుకున్న నగరపాలక సంస్థ!

గుంటూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ: గుంటూరు నగరానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా United Nations Industrial Development Organization ప్రతిష్టాత్మక Gender Equality Mobilization (GEM) Awardను ప్రకటించింది.

అవార్డు ప్రదానం

విజయవాడలో నిర్వహించిన Sustainable Cities Integrated Approach Pilot (SC-IAP) ప్రాజెక్టు ముగింపు వర్క్‌షాప్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ Surabhi Malik చేతుల మీదుగా గుంటూరు నగర కమిషనర్ K. Mayur Ashok ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఎందుకు ఈ గుర్తింపు?

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు Global Environment Facility (GEF) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులో గుంటూరు నగరం విశేష ప్రతిభ కనబరిచింది.

పారిశుధ్య నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత కల్పించడం, చెత్త సేకరణ కోసం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగించడం, ‘జీరో ఎమిషన్స్’ లక్ష్యంతో ముందుకు సాగడం వంటి చర్యలు గుంటూరుకు ఈ అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాయి.

మహిళా కార్మికులకు అంకితం

ఈ అవార్డు నగరంలోని పారిశుధ్య కార్మికులందరికీ, ముఖ్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు అంకితమని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు.

ఈ అంతర్జాతీయ గుర్తింపు గుంటూరు నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత అంశాల్లో మరింత బాధ్యతతో ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ సాధించిన ఈ ఘనత నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణంగా నిలిచింది.