guns | క‌రీంన‌గ‌ర్ జ్యువెల‌రీ షాపులో దోపిడీ

guns | క‌రీంన‌గ‌ర్ జ్యువెల‌రీ షాపులో దోపిడీ

guns |ఉమ్మడి కరీంనగర్ బ్యూరో ఆంధ్ర ప్రభ : క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని పీఎంజే జ్యువెల‌రీ షాపులో ఇవాళ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. ఐదుగురు దొంగ‌లు తుపాకుల‌తో షాపులోకి చొర‌బ‌డి షాపులోని సిబ్బందిపై కాల్పులు జ‌రిపారు. అంద‌రినీ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ భారీగా బంగారు ఆభ‌ర‌ణాలు దోచుకున్నారు. దొంగ‌లు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు సిబ్బందికి గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో రెండు బుల్లెట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్ప‌డిన పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

guns

సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ఈ దోపిడీలో ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లు సమాచారం. తప్పించుకున్న దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎంత బంగారం దోచుకెళ్లారనే విషయం వివరాలు కాసేపట్లో పోలీసులు తెలపనున్నారు.

guns

లాకర్లలో ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని దుండగులు క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు.

guns

అంద‌రినీ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ భారీగా బంగారు ఆభ‌ర‌ణాలు దోచుకున్నారు. దొంగ‌లు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు సిబ్బందికి గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో రెండు బుల్లెట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్ప‌డిన పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

CLICK HERE TO RAED

CLICK HERE TO READ MORE అలుగునూర్ వంతన పై ఘోర రోడ్డు ప్రమాదం

Leave a Reply