హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు..
హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా హోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. సుప్రభాత సేవలో భాగంగా దేవాలయంలో తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం, వివిధ పుష్పాలతో అలంకరించారు. అర్చనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఉభయ దాతలు మండలంలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన కీర్తిశేషులు గుర్రం శ్రీరాములు గారి భార్య కీర్తిశేషులు రంగ నాయకమ్మ కుమారులు గుర్రం సుధాకర్, రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను, అలంకరించి, భాజా భజంత్రీల నడుమ దేవాలయ ప్రాంగణం లోఊరేగించారు. హనుమంత వాహనంపై ఉత్సవ మూర్తులనుకు కొలువుదీర్చి, మాడవీధులలో శోభయాత్రగా తీసుకెళ్లారు. స్వామి వారి దర్శనార్థనం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, అర్చకులు మయూరం బాలాజీ చార్యులు, గుండురావు, బొల్లినేని పద్మాక్షి, దబ్బర మాధవి, బోయ రాములమ్మ, కురుబ ఇందిరమ్మ, బోయ ఎర్రమ్మ, చావలి బాయి, మీనుగ రామకృష్ణ, ధనంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, మంగళ చిన్న నారాయణప్ప, ఇంద్రావతి సుధాకర్, మాజీ సర్పంచులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు పాల్గొన్నారు.
