విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
తొర్రూరు,ఏప్రిల్17(ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పెద్ద మంగ్య తండ సర్పంచ్ జాటోత్ రాం లాల్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో వివేకానంద టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందించిన కల్చర్ ప్రాక్టీస్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు.విద్యార్థులు చదువుతోపాటు సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎన్.మాలతి, ఉపాధ్యాయులు ఆర్.ప్రేమ దీపిక, ఉప సర్పంచ్ సోమాని,మాజీ సర్పంచ్ జాటోత్ శారద, అంగన్వాడి టీచర్ సుజాత,ఆశ వర్కర్ మౌనిక,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
