బాపూర్‌లో రేషన్‌ దుకాణం ప్రారంభం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని తిప్రాస్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బాపూర్ గ్రామంలో మంగళవారం ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో రేషన్‌ దుకాణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు రేషన్‌ సరుకులు సకాలంలో, సులభంగా అందుబాటులోకి రావడానికి ఈ దుకాణం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బాపూర్ గ్రామంలోని లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కోసం 18 క్వింటాళ్ల బియ్యాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్‌ డీలర్‌ నరసింహ, నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్‌ గౌడ్‌, భగవంతు, శంకర్‌, నర్సిములు, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.