రేపటిలోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించాలి: తహసీల్దార్ పవన్‌చంద్ర

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాలను బుధవారంలోగా తప్పనిసరిగా సమర్పించాలని తహసీల్దార్‌ పవన్‌చంద్ర ఓటర్లకు సూచించారు.

మండల కేంద్రంలో ఇప్పటివరకు 71 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించారని తెలిపారు. మిగిలిన ఫారాలను గడువులోపు సమర్పిస్తే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ఉండేందుకు బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వద్ద ఉన్న ఎన్యూమరేషన్‌ ఫారాలను పూర్తి చేయించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ జాదవ్‌ ప్రకాష్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.