Slovakia Visit | భారత దేశ గీతాలాపనతో స్వాగతం

Slovakia Visit | భారత దేశ గీతాలాపనతో స్వాగతం

Slovakia Visit | ఆ దేశ అధ్యక్షుడు పీటర్​తో చర్చలు
వాణిజ్యం, సాంకేతికతలో పరస్పర సహకారం
పెట్టుబడులే లక్ష్యంగా మోదీ, పీటర్​ మధ్య చర్చలు
ఎక్స్​లో వివరాలు పోస్టు చేసిన ప్రధాని

Slovakia Visit | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోమవారం స్లోవేకియా చేరుకున్నారు. మోదీ రాక సందర్భంగా అక్కడి మహిళలు ముక్తకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ సాదరంగా స్వాగతించారు. ఆ దేశ‌ అధ్య‌క్షుడు పీట‌ర్ పెల్లెగ్రినితో మోదీ చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, సాంకేతిక‌త‌లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా మోదీ, పీట‌ర్ న‌డుమ చ‌ర్చ‌లు సాగ‌నున్నాయి. కాగా, దేశ రాజ‌ధాని బ్ర‌టిస్ల‌వా చేరుకున్న మోదీ రెండు రోజులు బ‌స చేయ‌నున్నారు. త‌న ప‌ర్య‌ట‌నతో భార‌త్ – స్లోవేకియా సంబంధాలు మెరుగ‌వుతాయ‌ని ప్ర‌ధాని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘రాజ‌ధాని బ్ర‌టిస్ల‌వా చేరుకున్నా. భార‌త్ – స్లోవేకియా మ‌ధ్య సంబంధాల బ‌లోపేతానికి, కొత్త వ్యాపారాలు, స‌హ‌కారం వంటివి సాధ్య‌ప‌డేందుకు ఈ ప‌ర్య‌ట‌న దోహ‌ద‌ప‌డ‌నుంది. అధ్య‌క్షుడు పీట‌ర్ పెల్లెగ్రిని, ప్ర‌ధాని పికోతో ఫ‌ల‌వంత మైన చ‌ర్చ‌లు జ‌రపాల‌ని భావిస్తున్నా’’ అని ప్ర‌ధాని ఎక్స్ పోస్ట్‌లో వెల్ల‌డించారు. స్లోవేకియాకు 1993లో స్వాతంత్రం వ‌చ్చాక ఆ దేశానికి వెళ్లిన మొద‌టి భార‌త ప్ర‌ధాని మోడీనే కావ‌డం విశేషం.

CLICK HERE TO READ Telangana Congress Leak Row | నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌పై రాహుల్​ సీరియస్​​

CLICK HERE TO READ MORE