7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు…

7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు…

కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారు
కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా మార్చడమే చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారు : సీఎం సతీమణి నారా భువనమ్మ

కుప్పం, ఆంధ్రప్రభ : కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నాడు కుప్పం మండలం, మంకలదొడ్డి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి సమావేశమై వారిని ఉద్దేశించి ప్రశాంగించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం గా పని చేస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం శుభ పరిణామం వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. సమాజాభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర వహించాలని మహిళల ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.

కుప్పం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారని చంద్రబాబు గారిని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి నా వంతు కృషి చేస్తున్నానని నారా భువనమ్మ తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. రాష్ట్రాన్నిబాగుచేయడం చంద్రబాబు వల్లే అవుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారన్నారు .

నిజం గెలవాలి యాత్ర చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు , టీడీపీ నేతలు, కార్యకర్తలు నన్ను ముందుండి నడిపించారని,గత ఐదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని కూటమి ప్రభుత్వంలో వచ్చాక సీఎం చంద్రబాబు పాలనదక్షతపై నమ్మకంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయని తెలిపారు.20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి రూ. 7,121 కోట్ల విలువైన పెట్టుబడులతో 17 పరిశ్రమలు తీసుకొచ్చారని వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు .

ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 2,203 కోట్ల పెట్టుబడులతో 7 పరిశ్రమలు స్థాపించారని వీటి ద్వారా 7093 మందికి ప్రత్యక్షంగా, 15,237 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.కుప్పంలో అడిడాస్ కంపెనీ ఫుట్ వేర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని మహిళలు స్వయం సమృద్ధి సాధించడం కోసం చంద్రబాబు ఎలీప్ సంస్థను కుప్పానికి తీసుకొచ్చారని ఇందు లో శిక్షణ తీసుకున్న మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. చెత్త నుంచి సంపద సృష్టికి చర్యలు తీసుకుంటున్నారని ఆమె తెలిపారు.

Leave a Reply