Govind Reddy | సీఎం ఇంటి వద్ద గోవింద్ రెడ్డి ఆత్మహత్యాయత్నం

Govind Reddy | సీఎం ఇంటి వద్ద గోవింద్ రెడ్డి ఆత్మహత్యాయత్నం

Govind Reddy | తిరుపతి తుడా, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు తనను అనుమతించలేదనీ చిత్తూరు జిల్లా పెద్దపంజాణికి మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన గోవింద్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం నుంచి సీఎంను కలవడానికి ప్రయత్నిస్తుంటే తనను అనుమతించడం లేదని మనస్థాపానికి గురైన గోవింద్ రెడ్డి తన వెంటి తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు స్పందించి గోవింద్ రెడ్డిని నారావారిపల్లెలోని పీహెచ్సీలో ప్రాథమిక చికిత్స అందించి అత్యుత్తమ చికిత్స కోసం తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. గోవింద్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని రుయా ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. గోవింద్ రెడ్డికి ఇంద్రజ, భవ్య ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు.

సీఎం ఇంటి వద్ద గోవింద్ రెడ్డి ఆత్మహత్యాయత్నం

Leave a Reply