Coalition Government | తిరుపతి జిల్లా దామినేడు వేదికగా భారీ ఏర్పాట్లు
Coalition Government | తిరుపతి జిల్లా దామినేడు వేదికగా భారీ ఏర్పాట్లు
30 వేల మందికి సీటింగ్ సౌకర్యం
ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Coalition Government | ఆంధ్రప్రభ, తిరుపతి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు తిరుపతి జిల్లా దామినేడు వేదిక కానుంది. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నేడు జరగనున్న ఈ సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
సభా ప్రాంగణాన్ని సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసి, జర్మన్ షెడ్లతో ప్రత్యేకంగా నిర్మించారు. దాదాపు 30 వేల మంది కూర్చునేలా విస్తృత సీటింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీరు, పార్కింగ్, భద్రత తదితర సౌకర్యాలను అధికారులు కల్పించారు.
ఈ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
అలాగే ప్రభుత్వ రెండేళ్ల పాలనా ప్రగతిని ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఈ స్టాళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు, సాధించిన పురోగతి, ప్రజలకు అందించిన సేవలకు సంబంధించిన వివరాలను ప్రదర్శించనున్నారు.
సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.
