చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం…

చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం…
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కటకం బాలరాజు సోదరుని కుమారుల నూతన వస్త్రాలంకరణ వేడుకకు ఆదివారం మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. చిన్నారులను ఆశీర్వదించారు.
పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ కోమల్ల మౌనిక, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, నాయకులు పాశికంటి శ్రీనివాస్, గుజ్జ అశోక్, మోర్తల రమణారెడ్డి, పాకాల హరీష్, బాసాని ప్రశాంత్ పాల్గొన్నారు.
