RTC Bus Accident | 16మందికి గాయాలు..
RTC Bus Accident | 16మందికి గాయాలు..
RTC Bus Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి-44పై శనివారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వనపర్తి డిపోకు చెందిన (నంబర్: TG 32 Z 0015) ఆర్టీసీ బస్సు మంత్రాలయం నుంచి 61 మంది ప్రయాణికులతో వనపర్తికి బయలుదేరింది.
పెబ్బేరు సమీపానికి చేరుకోగానే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల ద్వారా వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారి-44పై కొంతసేపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
