వటసావిత్రి వ్రత పూజలు చేస్తున్న మహిళలు
వటసావిత్రి వ్రత పూజలు చేస్తున్న మహిళలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని రామాలయ ఆవరణలో సోమవారం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని మర్రి చెట్టు కింద రామాలయ పూజారి సంతోష్ దూబే, మహిళలు వటసావిత్రి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజారి సంతోష్ దూబే వట సావిత్రి వ్రతాన్ని చదువుతూ మహిళలతో వ్రత పూజలు చేయించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మర్రిచెట్టుకు సాంప్రదాయబద్ధంగా దారాన్ని చుట్టి మంగళహారతులతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

