కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసి చైర్మెన్..

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసి చైర్మెన్..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ముత్తన్నపేట, తిమ్మాయిపల్లి గ్రామాలలో గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ నిర్ణయించిన కనీస మద్దతు ధరకు తమ వడ్లను అమ్ముకోవాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply