Government | మహత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన…

Government | మహత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన…
Government | నల్గొండ, ఆంధ్ర ప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(Government) మార్చినందుకు నిరసనగా ఈ రోజు డీసీసీ అధ్యక్షుడు ఉన్న కైలాస నేత ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ(Protest rally) నిర్వహించి రామగిరిలో ఉన్నమహత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జి.రామ్.జి పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాదాన్ని మహాత్మా గాంధీ(Mahatma Gandhi) పేరు మార్పును బీజేపీ ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గోపగాని మాధవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమం ముందు మహత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
