Temple | బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న…

Temple | బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న…
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్..
Temple | గద్వాల (ప్రతినిధి) ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతుగా జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ(MLC) కల్వకుంట్ల కవిత, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ బీచుపల్లి పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి(Sri Anjaneya Swamy) ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కు బీచుపల్లి దేవస్థాన ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

