కార్యకర్తలు ఆధైర్య పడొద్దు అండగా ఉంటాం
టిడిపి ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం, ఆంధ్రప్రభ : నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన పలు ఘటనల్లో గాయపడి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పరామర్శించారు. వైసీపీ దాడిలో గాయపడిన ఈరన్న, రాఘవేంద్ర పాటు రోడ్డు ప్రమాద బాధితులు కల్వకుంట గ్రామానికి చెందిన శ్రీరాములు తమ్ముడు టిడిపి కార్యకర్తలను అలాగే మేకడైన ప్రాంతానికి చెందిన టిడిపి కార్యకర్తలను పరామర్శించి కలిసి ధైర్యం చెప్పారు.
కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఇంచార్జి భరోసా ఇచ్చారు. ఇన్చార్జి వెంట నాయకులు అశోక్ రెడ్డి, మంత్రాలయం టౌన్ అధ్యక్షులు వరదరాజులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
