101 అంగన్ వాడి పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం..

101 అంగన్ వాడి పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 101 అంగన్ వాడి టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు వికారాబాద్ జిల్లా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. ఆ ప్రాజెక్టుల పరిధిలో గల ఖాళీల వివరాలు సంబంధిత సీడీపీవోలు వివరిస్తారని.. పూర్తి వివరాల కోసం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని మొదటి అంతస్థులో గల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.
