గుండ్లపోచంపల్లిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

299 డివిజన్‌లో జెండా ఆవిష్క‌ర‌ణ‌

​మేడ్చల్, ఏప్రిల్ 27:(ఆంధ్రప్రభ) : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు డాక్టర్ మండల సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మినీ ట్యాంక్ బండ్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.
​ఈ కార్యక్రమంలో ​ గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్, పార్టీ రాష్ట్ర నేత మద్దుల శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి జగన్ రెడ్డి, గోమారం శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి. ​మాజీ ప్రజాప్రతినిధులు: గౌడవెల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రాజు, హరి మాజీ కౌన్సిలర్లు అమరం జైపాల్ రెడ్డి, బేరి బాలరాజ్, అమరం హేమంత్ రెడ్డి, చింత పెంటయ్య. ​మాజీ కో-ఆప్షన్ సభ్యులు బట్టికాడ దేవేందర్ ముదిరాజ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ బండారి శ్రీనివాస్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సొంగారి సత్తిరెడ్డి. జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాము యాదవ్, నర్సింగ్ యాదవ్, దొడ్ల మధు, రమేష్, షేక్ ఇర్ఫాన్, యాదగిరి, సుంకు రమేష్, శ్రీనివాస్, బండారి రాజు, విద్యాసాగర్, మధుసూదన్ రెడ్డి హరి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ సాధించిన విజయాలను, తెలంగాణ అభివృద్ధిలో బిఆర్ఎస్ పాత్రను నాయకులు కొనియాడారు.

Leave a Reply