వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు..

వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంను ఆదివారం ఉదయం పట్టపగలుదుండగుడు రాళ్లతో విగ్రహ తలను పగలగొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంను గుర్తు తెలియని దుండగులు తల తీసివేయడంతో కొందరు స్థానికులు పట్టుకున్నట్టు సమాచారం.

ఆ ప్రాంతానికి వైఎస్సార్ అభిమానులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని పగలగొడుతున్న దృశ్యాన్ని చూసిన వైఎస్ అభిమానులు ఆ వ్యక్తిపై రాళ్లతో దాడి చేయడం విశేషం. పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నట్లు ఏ ఎస్ పి జావలి తెలిపారు.

Leave a Reply