పారిశ్రామిక చరిత్రలో సువర్ణ అధ్యాయం…

పారిశ్రామిక చరిత్రలో సువర్ణ అధ్యాయం…

ఏపీలో సరికొత్త ఐటీ విప్లవం..
గూగుల్ రాక ఏపీకి మరో మైలురాయి..
అంతర్జాతీయ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు..
మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు..
శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు..

విజయవాడ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలికిందని శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు పేర్కొన్నారు. విశాఖ వేదికగా ప్రారంభమైన గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి చారిత్రాత్మక ఘట్టమని రవి నాయుడు తెలిపారు. రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయి ఐటీ హబ్‌గా ఎదగడానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు.

రాష్ట్రంలో ఐటీ, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకమని పేర్కొంటూ, యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తీసుకున్న ముందడుగులను అభినందిస్తూ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని రవి నాయుడు పేర్కొన్నారు. విశాఖలో నిరుద్యోగ యువతీకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లోకేష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply