Revanth reddy | అల్లు సినిమాల్ మల్టీప్లెక్స్ ప్రారంభం..

Revanth reddy | అల్లు సినిమాల్ మల్టీప్లెక్స్ ప్రారంభం..

Revanth reddy | అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరు
అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ అంటూ ప్రశంసలు
హాలీవుడ్ లో కూడా రాణించాలి.. సీఎం ఆశాభావం
తెలుగు సినిమా హాలీవుడ్ తో పోటీ పడాలి
కృష్ణ అభిమానిని అంటూ రేవంత్ రెడ్డి జ్ఞాపకాలు

Revanth reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అల్లు సినిమాస్ ను హైదరాబాద్ కోకాపేటలో అత్యంత విలాసవంతంగా నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాకుండా.. సినిమా ఇండస్ట్రీ గురించి.. అల్లు అర్జున్ గురించి.. అలాగే సినిమా పై తన మనసులో మాటలను ఈ సందర్భంగా బయటపెట్టారు రేవంత్ రెడ్డి.

Revanth reddy | బన్నీ.. గ్లోబల్ స్టార్..

ఈ వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్.. హాలీవుడ్ లో నటించాలి.. అక్కడ కూడా రాణించాలి అన్నారు. ఆయన అలా అనడంతో ఆహుతులు హర్షధ్వానాలతో థియేటర్ ప్రతిధ్వనించింది. అల్లు అర్జున్ క్రేజ్.. ఇప్పుడు కేవలం టాలీవుడ్ కో, బాలీవుడ్ కో పరిమితం కాదని.. పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. త్వరలోనే అల్లు అర్జున్ హాలీవుడ్ సినిమాల్లో (Movies) కూడా నటించి తెలుగు వారి సత్తా చాటాలి అన్నారు. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని యాక్షన్, స్టైల్ బన్నీ సొంతం అన్నారు. అలాగే అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ సాధించడం మన అందరికీ గర్వకారణమని.. ఇప్పుడు చేసే సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు తిరగరాయాలని కోరుకుంటున్నాను అన్నారు.

Revanth reddy

Revanth reddy | కృష్ణ అభిమానిని..

తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడానికి ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ గారు ఎంతో కృషి చేశారు. కృష్ణ గారు ఎన్నో సాహసాలు చేసి సినిమా పరిశ్రమని మలుపు తిప్పారు. బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, పుష్ప.. తదితర చిత్రాలు తెలుగు (Telugu) సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయని.. తెలుగు సినిమాకి ఇప్పుడు పోటీ కోలీవుడ్, బాలీవుడ్ కాదని.. హాలీవుడ్ తో పోటీపడాలని పిలుపు ఇచ్చారు రేవంత్ రెడ్డి. తను కృష్ణ అభిమానిని అని.. ఆయన సినిమాల కోసం లారీ ఎక్కి వెళ్లి సినిమాలు చూసేవాడిని అని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ది తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు.

Revanth reddy