బోల్తాపడిన డీసీఎం వ్యాన్

బోల్తాపడిన డీసీఎం వ్యాన్

బెజ్జంకి, ఆంధ్రప్రభ : కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు కుటుంబంతో పాటు గృహాపకరణ వస్తువులు తరలిస్తున్న డీసీఎం వ్యాన్ మండలంలోని గాగిల్లాపూర్ గ్రామం రాజీవ్ రహదారి పై హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు జారిపడటంతో అందులో ఉన్న గృహోపకరణాలు, ఫర్నిచర్ బయటకు చెల్లాచెదురయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం గమనార్హం. వాహనంలో ఉన్న కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Leave a Reply