Krishna | సాంస్కృతిక వికాసానికి కృషి
Krishna | సాంస్కృతిక వికాసానికి కృషి
- తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు
Krishna | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : విద్యాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృష్ణారావు నిర్విరామ కృషి చేశారని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు(Tadikonda Venkateswara Rao) (చిన్నా) అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ రోజు అవనిగడ్డ వంతెన సెంటరులో కృష్ణారావు విగ్రహానికి తాడికొండ చిన్నా, ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామ ప్రముఖులు కుంపటి చిట్టిబాబు, గ్రామ పార్టీ సుంకర వీరయ్య చౌదరి, టీసీ అధ్యక్షుడు బోయిన నాగేంద్రరావు(Boina Nagendra Rao), ఈడుపుగంటి కృష్ణప్రసాద్, డొక్కు భీమరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం, మండలి అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు(Yasam Chittibabu), జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

