Godavarikhani | మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి…

Godavarikhani | మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి…

గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమలో మారుపేరుల కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎండగాడుతూ, సోమవారం సాయంత్రం పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సమస్యపై జిఎం కార్యాలయం ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

దీర్ఘకాలంగా మారుపేరుల నియామకాల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇస్తూనే, దశాబ్ద కాలంగా జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా వందలాదిమంది డిపెండెంట్ కార్మికులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ, సమస్యను పట్టించుకోవడం లేదని యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు.

“మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి…” అంటూ ఆందోళనకారులు గగ్గోలు పెట్టారు. సమస్య పరిష్కారం ఆలస్యం కావడంతో మారుపేరుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులపాలు అవుతున్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి మారుపేరుల సమస్యపై వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.