Good News | త‌గ్గిన ప‌సిడి రేట్లు!

Good News | త‌గ్గిన ప‌సిడి రేట్లు!

  • Good News | బంగారు ప్రియుల‌కు శుభ‌వార్త‌

Good News | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ అయిన‌ప్ప‌టికీ బంగారం ధ‌ర‌లు స్వ‌ల్ప త‌గ్గుతున్నాయి. ఈ సమ‌యంలో ప‌సిడి రేట్లు ప‌రుగులు తీయ‌కుండా ఎంతోకొంత త‌గ్గ‌డం బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త అని చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది.

ఈ రోజు బంగారం రేట్లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం రూ.12,513 ధ‌ర ఉంది. నిన్న రూ.12,584 ఉండేది. నిన్న‌టికంటే రూ.71లు త‌గ్గింది. అంటే ప‌ది గ్రాముల వ‌ద్ద రూ.710 లు త‌గ్గింది. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం రూ.11,470 ధ‌ర ఉంది. నిన్న రూ.11,535 ఉండేది. నిన్న‌టికంటే రూ.65 లు త‌గ్గింది. అంటే ప‌ది గ్రాముల వ‌ద్ద రూ.650 లు త‌గ్గింది.

ఈ వారం కూడా ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ1,20,000-1,25,000 రేంజ్‌లోనే ధరలు కదలాడే అవకాశం ఉందని చెబుతున్నాయి. వెండి ధరలు కూడా ప్రస్తుతమున్న స్థాయికి దాదాపుగా పరిమితం అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.

దేశంలోని వివిధ న‌గ‌రాల్లో గోల్డ్ రేట్లు (ప‌ది గ్రాముల ధ‌ర‌)

  • చెన్నై: – 24కే :1,26,870 – 22కే 1,16,290
  • ముంబై: – 24కే : 1,25,830 – 22కే 1,15,340
  • న్యూ ఢిల్లీ: – 24కే : 1,25,980 – 22కే 1,15,490
  • కోల్‌కతా: – 24కే : 1,25,830 – 22కే 1,15,340
  • బెంగళూరు: – 24కే : 1,25,830 – 22కే 1,15,340
  • పూణె: – 24కే : 1,25,830 – 22కే 1,15,340
  • వడోదరా: – 24కే : 1,25,880 – 22కే 1,15,390
  • అహ్మదాబాద్: 24కే : 1,25,880 – 22కే 1,15,390

Leave a Reply