వార్డులో సమస్యలు లేకుండా ప్రజా సేవచేస్తా..

9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అప్పం కిషన్

భూపాలపల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రప్రభ): భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని మంజూరు నగర్, మహబూబ్ పల్లి, బీసీ కాలనీ, కుందురుపల్లి గ్రామ కాలనీలలో సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి కాలనీల అభివృద్ధి చేస్తానని 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అప్పం కిషన్ తెలిపారు.

శనివారం ఒకప్పుడు గ్రామాలుగా ఉన్న ప్రాంతాన్ని మున్సిపల్ పరిధిలోకి చేసి ఏండ్లు గడుస్తున్నా కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి కనిపిస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత నుండి గ్రామాలలో 9వ వార్డులలో అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. గత ప్రభుత్వాలు ఏమీ పని కూడా చేయలేదని , కేవలం ప్రజల్ని కేవలం ఓటు యంత్రంలా చూస్తున్నారని దుయ్యబట్టారు. కావున కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు పై అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి గెలిపించాలని అభివృద్ధి మాత్రమే ఏజెండా అని ప్రజలు గమనించాలని ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Leave a Reply