Goa2017 | కళతప్పుతున్న బీచ్‌లు
Goa2017 | కళతప్పుతున్న బీచ్‌లు
తగ్గిపోయిన ఫారెనర్ల రాక
ఒకనాడు భారీగా వచ్చిన విదేశీ పర్యటకులు
ఇప్పుడు మాత్రం ఎందుకు తగ్గారు?
దేశీయ పర్యాటకుల రాక పెరిగింది
గోవా టూరిజం శాఖ గణాంకాలే దీనికి సాక్ష్యం
అంతర్జాతీయ సంక్షోభాలు కారణమేనా
గోవా టూరిజంపై ఫారెనర్లు ఏమంటున్నారు
Goa2017 | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : గోవా దక్షిణ ప్రాంతం అంచున పొడవాటి ఇసుక తీరరేఖలో నెలవంక ఆకృతిలో ఉండే పాలోలెమ్ బీచ్ వద్ద మధ్యాహ్న సమయమైంది. భానుడు భగభగలాడి పోతున్నాడు. అయినా సముద్రంలో పర్యటకుల హుషారును ఆ ఎండ ఏమాత్రం ఆపలేకపోతోంది. భారతదేశపు పార్టీ రాజధానిగా తరచూ పిలిచే గోవాలో బీచ్ వైపుండే గుడిసెల్లాంటి తాత్కాలిక వసతి గృహాలు, తక్కువ ఖర్చుతో దొరికే హోటళ్లు పర్యటకులతో నిండిపోయాయి. అయితే.. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ఇక్కడ వచ్చిన మార్పేంటంటే ఒకప్పుడు పాలోలెమ్‌తో పాటు గోవాలోని ఇతర బీచ్ గ్రామాల్లో యూరోపియన్లు, రష్యన్లు ఎక్కువ కనిపించేవారు. ఇప్పుడు ఆ పర్యటకులు కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నవారంతా దాదాపుగా దేశీయ పర్యటకులే. ఇది గమనిస్తే విదేశీ పర్యటకులకు గోవాపై ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. దేశీయ పర్యటకుల సంఖ్య బాగా పెరిగింది. మారుమూల ప్రాంతాల ప్రజల్లో కూడా గోవాపై ఆకర్షణ పెరిగింది.

Goa2017 | మారుమూల ప్రాంతాల నుంచి గోవాకు పర్యటకులు..
గోవా పర్యటకశాఖ విడుదల చేసిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2017లో గోవాను దాదాపు 9 లక్షలమంది విదేశీ పర్యటకులు సందర్శించారు. 2025 నాటికి ఆ సంఖ్య దాదాపు 5 లక్షలకు పడిపోయింది. 2016లో దేశీయ పర్యటకుల సంఖ్య 68 లక్షలుంటే, గత ఏడాది వారి సంఖ్య కోటి దాటింది. ప్రపంచ భౌగోెళిక రాజకీయ పరిస్థితులు విదేశీ పర్యటకులపై ప్రభావం చూపుతున్నాయని గోవా పర్యటక శాఖ ఇటీవల తెలిపింది. ‘భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు మేం ఒకవైపు నిరాశగానూ, మరోవైపు ఆశావాదంతోనూ ఉండాల్సి వస్తోంది’’ అని గోవా పర్యటక మంత్రి మేం ఆశావాదంతో పాటు జాగ్రత్తలు కూడా వహించాలి” అని గోవా పర్యటక మంత్రి రోహన్ ఖాంటే స్థానిక మీడియాకు చెప్పారు. అయితే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడం ఇటీవలి సంక్షోభాలకంటే ముందే జరిగింది. 1960లు, 1970లో హిప్పీల సంస్కృతి ప్రాచుర్యంలో ఉన్న కాలం నుంచే తక్కువ ఖర్చుతో కూడిన విహార కేంద్రంగా గోవాను ఇష్టపడుతూ వచ్చిన విదేశీ పర్యటకులు ఇప్పుడెందుకు దూరమవుతున్నారు?
Goa2017 | అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం..

ప్రజల పరిస్థితి బాలేదు. ముందు కోవిడ్, తర్వాత యుక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు మిడిల్ఈస్ట్ పరిణామాలతో విమాన ప్రయాణం బాగా ఖరీదైన వ్యవహారంగా మారింది. కాబట్టి డబ్బు ప్రభావం చాలా ఉందని ఐదోసారి గోవా పర్యటనలో ఉన్న రష్యన్ బ్యాలే డ్యాన్సర్ సోఫీ మీడియాకు చెప్పారు. ”నా స్నేహితుల్లో కొందరు ఈ ఏడాది గోవా కాకుండా తుర్కియే లేదంటే ఈజిప్టు వెళ్తున్నారు. అవి మాకు దగ్గరగా ఉండడం, తక్కువ ఖర్చులో వెళ్లగలిగే అవకాశం ఉండడం ఇందుకు కారణం అన్నారు. 20 ఏళ్ల నుంచి న్యూకాజిల్ నుంచి గోవా వస్తున్న రికో కూడా యూరప్ పర్యటకుల గురించి ఇలాగే చెప్పారు. మా దేశంలో ప్రస్తుతం విదేశీ పర్యటనలకు ఖర్చుపెట్టడానికి ఎక్కువ డబ్బు లేదు. మూడేళ్లగా పర్యటకులు సొంత దేశంలోనే సెలవులు గడపడానికే మొగ్గు చూపుతున్నారు అని తెలిపారు. వీసా ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడం, అలాగే ఐదేళ్ల వీసా ఖర్చులు పెరగడం కూడా పర్యటకుల సంఖ్య తగ్గడానికి కారణమని చాలామంది అభిప్రాయపడ్డారు.
Goa2017 | యాప్‌లో ట్యాక్సీ బుక్ చేసుకోలేం..
లండన్ గాత్విక్ నుంచి నేరుగా గోవా వచ్చే ఎయిర్ ఇండియా సర్వీస్ నిలిపివేయడం కూడా టూరిజంపై ప్రభావం చూపుతోంది. పాలోలెమ్‌కు ఉత్తరంగా ఉన్న బెనాలియం బీచ్‌లోని తాత్కాలిక వసతి గృహంలో ఉన్న నికోలా అనే హెయిర్ డ్రెస్సర్ మీడియాతో మాట్లాడారు. మూడు వారాలు గోవాలో గడిపేందుకు ఆమె తన స్నేహితులు అల్సిన్, డ్వేన్‌తో కలిసి వచ్చారు. ఎయిర్ ఇండియా సర్వీసు రద్దు చేయడంతో ముంబైలో అనుకోకుండా ఆగాల్సి వచ్చిందని, అది సౌకర్యవంతంగా లేదని చెప్పారు. ఈ ఏడాది తన సోదరుడు గోవాకు బదులు శ్రీలంక వెళ్లారని చెప్పారు. ఇక.. బీచ్‌లను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కానీ బీచ్‌కు వెళ్లేరోడ్లు చెత్తతో నిండిపోయి చూడడానికి బాగుండడం లేదని డియాస్ అన్నారు. అంతేకాకుండా స్థానిక ట్యాక్సీ యూనియన్లు యాప్ ఆధారిత సర్వీసులను వ్యతిరేకించడంతో ట్యాక్సీల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అది కూడా పెద్ద సమస్యగా మారిందని టూరిస్టులు అంటున్నారు. అయితే.. పర్యటకరంగంపై ఆధారపడిన గోవా ఆర్థిక వ్యవస్థకు ఈ పరిస్థితులు మంచివి కావని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే.. ఈ సమస్యను గోవా ప్రభుత్వం గుర్తించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు.
CLICK HERE TO READ MORE : 15,289 kilometers | తైవాన్‌కు మద్దతు ఇవ్వలేమని స్పష్టీకరణ
