ఘనంగా కృత్తికా నక్షత్ర వేడుకలు..

సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం కృత్తికా నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి లలిత సహస్రనామ పారాయణం చేశారు.

అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అధికమాసం తొలి రోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక వాయనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు మ్యాడం రాధా కిషన్, కమిటీ సభ్యులు ఆమెటి మహేందర్, కోశాధికారి జూలకంటి మల్లేశం, కార్యనిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్‌తో పాటు ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply