75kmph | దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

75kmph | దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

75kmph | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : రైలు నడిస్తే దట్టమైన నల్లటి పొగ రావడం లేదా కరెంట్ వైర్ల నుంచి వింత శబ్దాలు రావడం మనకు తెలుసు. కానీ, సైలెన్సర్ నుంచి పొగకు బదులు స్వచ్ఛమైన తాగునీరు, చల్లని నీటి ఆవిరి వచ్చే రైలును ఎప్పుడైనా ఊహించారా? అవునండీ ఇది నిజం! ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా భారతదేశం తన మొట్టమొదటి విప్లవాత్మక ‘హైడ్రోజన్ రైలు’ను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేసింది. డీజిల్ లేదు.. కరెంట్ వైర్లు లేవు.. కేవలం రాకెట్లలో వాడే పవర్‌ఫుల్ టెక్నాలజీతో దూసుకెళ్లే ఈ సరికొత్త దేశీయ అద్భుతం విశేషాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..

ఉత్తర రైల్వే పరిధిలోని హర్యానాలోని జీంద్ – సోనిపట్ సెక్షన్‌లో ఈ రైలును నడపడానికి భారతీయ రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో హైడ్రోజన్ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల (75 kmph) వేగంతో దూసుకుపోనుంది.

ఈ రైలు ప్రత్యేకతలు ఇవే..

పొగ రాదు.. నీరొస్తుంది!
అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లలో వాడే పవర్‌ఫుల్ హైడ్రోజన్ ఇంధన సాంకేతికతతో ఇప్పుడు మన దేశంలో రైలు నడవబోతోంది. పెట్రోల్, డీజిల్ కంటే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. ఈ ప్రతిష్టాత్మక రైలులో మొత్తం 10 కోచ్‌లు (కంపార్ట్‌మెంట్లు) ఉంటాయి. ఇది 1200 కిలోవాట్ సామర్థ్యం గల అత్యంత శక్తివంతమైన సరికొత్త ఇంజన్‌తో నడుస్తుంది.

సాధారణ డీజిల్ రైళ్లు నడిస్తే విపరీతమైన పొగ, కాలుష్యం వస్తాయి. కానీ, ఈ రైలు ‘హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ కలవడం ద్వారా కరెంట్ తయారై రైలు నడుస్తుంది. ఈ ప్రక్రియలో కాలుష్యానికి బదులు కేవలం నీటి ఆవిరి మాత్రమే పర్యావరణంలోకి విడుదలవుతుంది.

ప్రపంచ ఎలైట్ క్లబ్‌లోకి భారత్..
ఈ వినూత్నమైన అత్యంత ఖరీదైన సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసి, విజయవంతంగా అమలు చేయడం ద్వారా.. క్లీన్ అండ్ సుస్థిర రైలు రవాణా కోసం హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుతున్న ప్రపంచంలోని కొన్ని అత్యున్నత దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది.
భారతీయ రైల్వేను ‘నెట్ జీరో కార్బన్ ఎమిటర్’ (అంటే కాలుష్య ఉద్గారాలు లేని సంస్థ) గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ఒక కీలక అడుగుగా నిలవనుంది.

ట్రయల్ రన్స్ పూర్తి చేసుకున్న ఈ రైలు త్వరలోనే సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో మన రైల్వే ప్రయాణాల రూపురేఖలను మార్చబోతున్న ఈ సరికొత్త టెక్నాలజీ అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

CLICK HERE TO READ Symptoms | ఉగాండా మహిళకు నెగెటివ్‌గా నిర్ధారణ

CLICK HERE TO READ MORE

Leave a Reply