GAS | హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
GAS | హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
GAS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.
వాణిజ్య సిలిండర్ల సరఫరా లేక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 20శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ముంబై హోటల్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్యాస్ సరఫరా ఆగిపోతే మరో రెండు రోజుల్లో 50శాతం హోటళ్లు మూతపడే అవకాశముందని ఆ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నై హోటల్స్ అసోసియేషన్ ప్రధానికి లేఖ రాసింది. ఫుడ్ ఇండస్ట్రీకి గ్యాస్ సరఫరాను పునరుద్దరించాలని కోరారు. ఈ ప్రభావం హాస్పిటల్స్, హాస్టల్స్ కు భోజన సరఫరా వంటి వాటిపై కూడా పడుతుంది.
