KKR Vs PBKS – ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా

చండీఘర్ – 112 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

తొలి ఓవర్లోనే సునీల్ న‌రైన్‌ సున్నా పరుగులకు జెన్ సన్ బౌలింగ్. లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జెవియర్ బౌలింగ్ లో డి కాక్ పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సమయానికి రెండ్ వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది

జాగా , ఐపీఎల్ 18వ సీజ‌న్ భీక‌ర బ్యాటింగ్ లైనప్‌తో కొండంత స్కోర్ కొట్టే పంజాబ్ కింగ్స్ సొంతంగ‌డ్డ‌పై కుప్ప‌కూలింది. ముల్ల‌నూర్‌లో టాపార్డ‌ర్ వైఫ‌ల్యంతో స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ల విజృంభ‌ణ‌తో పంజాబ్ 15.3 ఓవ‌ర్ల‌కే ఆలౌట‌య్యింది. పేసర్ హర్షిత్ రానా(3-25) నిప్పులు చెర‌గ‌గా.. స్పిన్ ద్వ‌యం వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(2-21), సునీల్ న‌రైన్‌(2-14)లు తిప్పేశారు. దాంతో, 111 ప‌రుగుల‌కే పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.

Leave a Reply