Aditya dhar | అందుకే.. ప్లాన్ మార్చాడా..?
Aditya dhar | అందుకే.. ప్లాన్ మార్చాడా..?
Aditya dhar | పాన్ ఇండియా ట్రెండ్‌కు కొత్త ఊపు
రాజమౌళి బాటలో దర్శకులు
కేజీఎఫ్, పుష్ప సిరీస్‌ల ప్రభావం
ఆదిత్య ధర్ ప్లాన్ మారిందా?
ధురందర్ 2 పై భారీ అంచనాలు
ధురందర్ 3కి క్లైమాక్స్ హింట్?
Aditya dhar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాహుబలి సినిమాతో ఒక కథను రెండు పార్టులుగా తీయడం అనే ట్రెండ్ కు ఊపొచ్చింది. అలాగే పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో స్టార్ హీరోలే కాదు.. యంగ్ హీరోలు సైతం.. పాన్ ఇండియా మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా డైరెక్టర్స్ సుకుమార్, ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి బాటలో.. ధురందర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆదిత్య ధర్ ఏం చేయబోతున్నాడు..?
Aditya dhar | రాజమౌళి బాటలో..

దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి కథను రెండు పార్టులుగా చెప్పాడు. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించాడు. ఇక అక్కడ నుంచి కథను రెండు పార్టులుగా చెప్పడం స్టార్ట్ అయ్యింది. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం సైతం రాజమౌళి స్పూర్తితోనే పొన్నియన్ సెల్వన్ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. రాజమౌళి బాహుబలి సినిమాని రెండు పార్టులుగానే తీసారు కానీ.. మూడవ పార్ట్ తీయలేదు. ఆతర్వాత తీసిన ఆర్ఆర్ఆర్ మూవీని అయితే ఒక పార్ట్ గానే తీసారు.
Aditya dhar | కేజీఎఫ్ 3, పుష్ప 3..

కేజీఎఫ్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ నీల్. ఆతర్వాత కేజీఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ సాధించి పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ సొంతం చేసకున్నాడు. అయితే.. కేజీఎఫ్ 2 ఎండింగ్ లో కేజీఎఫ్ 3 ఉందని హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం నీల్ బిజీగా ఉండడం వలన ఇంకా కేజీఎఫ్ 3 స్టార్ట్ చేయలేదు. ఆతర్వాత పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్.. పుష్ప 2తో అయితే.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించాడు. సుకుమార్ కూడా పుష్ప 2 తర్వాత పుష్ప 3 ఉందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చాడు.
Aditya dhar | ధురందర్ 3..

ఇదిలా ఉంటే.. ధురందర్ అంటూ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు ఆదిత్య ధర్. దీంతో ధురందర్ 2 కి విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అసలు సౌత్ లో ఈ సినిమాని ప్రమోట్ చేయకపోయినా.. కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోయినా.. రికార్డు స్థాయిలో ఓపెనింగ్ వచ్చేలా క్రేజ్ ఏర్పడడం విశేషం. సెకండ్ పార్ట్ తోనే ఈ కథను ఎండ్ చేయాలి అనుకున్నప్పటికీ.. ఆదిత్య ధర్ ఆలోచన మారిందట. ప్రశాంత్ నీల్, సుకుమార్ బాటలో.. థర్డ్ పార్ట్ కూడా తీయాలని ఫిక్స్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. ధురందర్ 2 క్లైమాక్స్ లో.. పార్ట్ 3 గురించి హింట్ ఇస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇది నిజమో కాదో తెలియాలంటే.. 19 వరుకు వెయిట్ చేయాల్సిందే.
