మంత్రి ఉత్తమ్ ను కలిసిన మంత్రి వాకిటి..

మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ కి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించి ఆయనకు జన్మదిన శుభాభినందనలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవకై ఆ భగవంతుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరింత బలాన్ని ప్రసాదించాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.