వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన…

వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని కల్లేపల్లి గ్రామంలో అంత్యక్రియల నిర్వహణ భూ వివాదానికి దారితీసి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులు తమ సొంత భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అదే స్థలంపై హక్కుల వివాదం ఉన్నట్లు పేర్కొంటూ గ్రామానికి చెందిన మైల భాస్కర్, మైల స్వామి అభ్యంతరం తెలిపారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పెరిగింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో మైల స్వామి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని, అంత్యక్రియలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టారు.

Leave a Reply