15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి

15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి

సూర్యాపేట జిల్లా​గరిడేపల్లి,ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తూ, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను కేవలం 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించి పనులు పూర్తి చేయించారు. కీతవారిగూడెం నుండి మునగాల వరకు నూతనంగా నిర్మించిన రహదారిలో, వెలిదండ గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద కొంత భాగం రహదారి నిర్మాణం నిలిచిపోయింది. దీనివల్ల వాహనదారులు, ముఖ్యంగా అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

​వెంటనే స్పందించిన మంత్రి ​ఇటీవల హుజూర్నగర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వెలిదండ గ్రామ సర్పంచ్ చెన్నగాని సాంబయ్య ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తక్షణమే సంబంధిత ఆర్ అండ్ బి (R&B) అధికారులతో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, నిలిచిపోయిన రహదారి పనులను కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేసింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనిని అతి తక్కువ కాలంలో పూర్తి చేయించడంపై వెలిదండ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలను గుర్తించి వెంటనే స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఈ విషయంలో చొరవ చూపిన సర్పంచ్ కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply