గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం

గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం
చిట్యాల, ఆంధ్రప్రభ : స్వచ్ఛ సుంకెన పల్లి గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చిట్యాల మండలం సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య తెలిపారు. మంగళవారం నాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగా నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం సుం కెనపల్లి గ్రామంలో సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య, పాలకవర్గం, పంచాయతీ కార్మికుల తోటి చేత పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించిన అనంతరం సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య గ్రామంలో అన్ని వార్డులలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.
పారిశుద్ధ కార్మికుల చేత సర్పంచ్ దగ్గర నుండి మురుగు కాలువల ను శుభ్రం చేయించారు. సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య మాట్లాడుతూ… ఇంటి పరిసరాలలో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు మురుగు నీరు నిలవకుండా చూసుకొని దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విష జ్వరాల బారిన పడకుండా ఉంటామని సర్పంచ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
గ్రామాన్ని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సర్పంచ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ చీపురు పోరక పట్టి వీధులను శుభ్రపరచారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కోసనం శేఖర్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరుపాలు ఉన్నారు.
