వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నల్గొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కార్యాలయ అధికారులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వి. వినోద్ కుమార్ జాతీయ జెండా ఎగరవేశారు.అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపర్డెంట్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply