మండుతున్న ఎండల్లో మజ్జిగ పంపిణీ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీమ్ బేగ్ ఆధ్వర్యంలో మచిలీపట్నం రామనాయుడుపేటలోని సిద్ధి బుద్ధి మహా గణపతి దేవాలయంలో బాటసారుల కోసం ఉచిత చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మండుతున్న ఎండల్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు నాగసాయి, హసీమ్ బేగ్‌ను దుశ్యాలతో సత్కరించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా హసీమ్ బేగ్ మాట్లాడుతూ, సాటి వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కులమతాలకు అతీతంగా సోదరభావంతో ముందుకు సాగితే సమాజంలో మానవత్వం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. సేవాభావంతో చేసే దానధర్మాలు సమాజంలో మంచి మార్పుకు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, మాదిరెడ్డి శ్రీను, అడపా రత్నాకర్, అబ్దుల్ అజీమ్ బాబు, ముచ్చెర్ల రాజు, వినకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
