ఘనంగా శ్రీ శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం..

ఘనంగా శ్రీ శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం..
ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
అతిథులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు
బాపులపాడు – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్‌లకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతనంగా ప్రతిష్టించిన బీరప్ప స్వామిని వారు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా కురుమ సంఘం, దేవస్థాన కమిటీ పెద్దలను, పుణ్య దంపతులను కలిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలోని కాకులపాడు గ్రామంలో తమ కులదైవమైన బీరప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు కుల బాంధవుల కోసం భజన మందిర నిర్మాణానికి టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.

అలాగే ఎమ్మెల్యే కోరిన విధంగా బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఈ నియోజకవర్గంలోని హాస్టళ్లను కూడా త్వరలోనే ఆధునీకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఆమె పునరుద్ఘాటించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ, తమ నియోజకవర్గ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.
మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ద్వారా 15,000 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా శిక్షణ కేంద్రాలు, హెచ్‌సిఎల్ (HCL) కంపెనీ సహకారంతో హాస్టళ్లలో ఆర్‌ఓ ప్లాంట్లు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటాన్ని గమనించానని, అందుకే మంత్రి సవిత చొరవతో నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు హనుమాన్ జంక్షన్ కూడలిలోని అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ర్యాలీ గా కాకులపాడు గ్రామం చేరుకున్న నేతలకు గ్రామ నాయకులు, కురభ సంఘం నేతలు గజ మల తో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు తట్టి అర్జునరావు , కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర అప్పన్న, రాష్ట్ర కురుమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి ప్రసాద్, గుంటూరు జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మర్రి సత్యనారాయణ, కృష్ణా జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు గౌరా వెంకటేశ్వరరావు, వెస్ట్ గోదావరి కురుమ సంఘం ప్రెసిడెంట్ దన్నే అశోక్, బీరయ్య స్వామి దేవాలయం ప్రెసిడెంట్, కృష్ణా జిల్లా కురుమ సంఘం సెక్రటరీ ఎనికేపల్లి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పడకల రాజశేఖర్, కాకులపాడు గ్రామ టిడిపి అధ్యక్షులు చెన్నుబోయిన వీర వెంకట్రావు, జనసేన పార్టీ సమన్వయ కర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, మూల్పురి సాయి కళ్యాణి, ఆళ్ల గోపాలకృష్ణ, మొవ్వ వేణుగోపాల్, చప్పిడి రమేష్, వేగిరెడ్డి పాపారావు, చలసాని శ్రీనివాసరావు, కొమ్మారెడ్డి రాజేష్, జాస్తి భూపతి, అన్నే చైతన్య, యజ్జువరపు శ్రీనివాసరావు, మున్నంగి శేషగిరిరావు, దన్నే దుర్గారావు, చింతల వెంకట అప్పారావు, చెన్నుబోయిన నాగరాజు, దన్నే మల్లిఖార్జునరావు, యజ్జువరపు రంగారావు, అట్లూరి శ్రీనివాసరావు, కొల్లూరు చంద్రకాంత్, స్థానిక భక్తులు, కురుమ సంఘం నాయకులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
