గన్నవరంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం

గన్నవరంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం
గన్నవరం, ఆంధ్రప్రభ :
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గన్నవరంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ మడుపల్లి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో, ఎస్.ఆర్. జ్యువెలర్స్ అధినేత వెంగళ కోటేశ్వరరావు–లక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్.ఆర్. జ్యువెలర్స్ వద్ద బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు చల్లటి త్రాగునీరు అందించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణమూర్తి మాట్లాడుతూ గాంధీ చౌక్, వెంకటేశ్వర థియేటర్ సెంటర్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగునీరు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. దాతల సహకారంతో ప్రతిరోజు సుమారు 30 కూలింగ్ వాటర్ క్యాన్లు, 120 లీటర్ల మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత 56 రోజులుగా నిరంతరంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, సహకరిస్తున్న దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వీసం ప్రసాదరావు, కన్వీనర్ కర్రా వరప్రసాద్, సంయుక్త కార్యదర్శి వడ్లమూడి వెంకటేశ్వరరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
