మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ సేవలు…
మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ సేవలు…
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కార్యాలయం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 63వ డివిజన్ రాజీవ్ నగర్ మరియు 64వ డివిజన్ కండ్రిక ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మొత్తం 5 లక్షల 47 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు వంటి కష్టకాలాల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే తక్షణమే సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణ మోహన్, 64వ డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం,కోలా శ్రీను,ఇంఛార్జి మోతుకురి ఖాసిమ్,ఎస్. కె.బాబు,కోమరి రాజేష్,కంకణాల బాబు, తదితరులు పాల్గొన్నారు.
