ఎర్రచందనం సాగు పేరుతో మోసం..
ఎర్రచందనం సాగు పేరుతో మోసం..
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఎర్రచందనం మొక్కలు నాటించి, పూర్తి స్థాయి ఫెన్సింగ్, డ్రిప్ (సీసీటీవీ సోలార్ కెమెరాలు) సోలార్ ఫినిషింగ్ ఏర్పాటు చేసి అధిక లాభాలు అందిస్తామని నమ్మబలికి డోంగర్గావ్ గ్రామానికి చెందిన రైతుల నుండి రూ.5.20 లక్షలు 2025లో వసూలు చేసి పరారైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రకు చెందిన నిందితులు తన్నీరు హేమంత్ కుమార్, ముదిరాల ఆనంద్ అనే ఇద్దరు ఎర్రచందనం సాగు ద్వారా భారీ ఆదాయం వస్తుందని, మొక్కల సరఫరాతో పాటు ఫెన్సింగ్, నీటి సదుపాయాలు ఇతర ఏర్పాట్లన్నీ తామే చేస్తామని బాధితుడిని నమ్మించారు. ఈ క్రమంలో 5 లక్షల 20 వేల రూపాయలు తీసుకున్న అనంతరం ఎలాంటి పనులు చేపట్టకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నందుకు వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్థానిక సీఐ మడావి ప్రసాద్, ఎస్సై సాయన్నలు అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.
