కాలి వేళ్లతో గవర్నర్ చిత్రపటం..

కాలి వేళ్లతో గవర్నర్ చిత్రపటం..

రాష్ట్ర అవతరణ వేడుకల్లో వైష్ణవి ప్రతిభకు ప్రశంసల వెల్లువ!

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దివ్యాంగురాలు వైష్ణవి తన అసాధారణ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది.

కాలి వేళ్లతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చిత్రపటాన్ని రూపొందించిన వైష్ణవి, ఆ చిత్రాన్ని గవర్నర్‌కు స్వయంగా అందజేసింది. ఆమె కళాత్మక ప్రతిభను చూసిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అభినందనలు తెలియజేస్తూ ఆశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా వైష్ణవికి జ్ఞాపిక (మెమెంటో) అందజేసి ప్రత్యేకంగా సత్కరించారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రతిభను చాటుకున్న వైష్ణవిని పలువురు ప్రశంసించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కూడా వైష్ణవిని అభినందిస్తూ ఆమె ప్రతిభ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో వైష్ణవి ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, కళా నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave a Reply