దివిస్ పరిశ్రమలో భద్రతా దినోత్సవం వేడుకలు

దివిస్ పరిశ్రమలో భద్రతా దినోత్సవం వేడుకలు

  • రవీంద్ర భారతిలో దివిస్ సేఫ్టీ ఎగ్జిబిషన్
  • దివిస్ ఉద్యోగికి రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతి
  • అభినందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలోని దివిస్ పరిశ్రమ యాజమాన్యం 55వ జాతీయ భద్రత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఎస్ రామకృష్ణ జెండాను ఆవిష్కరించగా మరో వైస్ ప్రెసిడెంట్ జి హేమంత్ కుమార్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఉద్యోగులంతా భద్రతా ప్రమాణాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాలలో చీప్ టెక్నాలజిస్ట్ పి శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ జి బాలకిషోర్, ఏజీఎం ఎన్ సాంబశివరావు, పరిశ్రమ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

అదేవిధంగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో భద్రత దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి సేఫ్టీ ఎగ్జిబిషన్ లో దివిస్ పరిశ్రమ ఉద్యోగి ప్రథమ బహుమతిని సాధించారు. ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం దాన కిషోర్, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ వై మోహన్ బాబు లు ప్రథమ బహుమతి సాధించిన దివిస్ ఉద్యోగులను అభినందించారు.

Leave a Reply