న్యాయం జరుగుతుందో లేదోనని..

న్యాయం జరుగుతుందో లేదోనని..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆస్తి పంపకాల విషయంలో న్యాయం జరుగుతుందో లేదోనని మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బినవేని రవి (23) గత కొద్దిరోజులుగా తన అమ్మమ్మ ఊరైన దండేపల్లి మండలంలోని శ్రీరాములపల్లెలో తల్లి కొమురక్కతో ఉంటున్నాడు.
అతని స్వగ్రామం చింతలపల్లిలో ఉన్న ఆస్తి విషయంలో బంధువులతో వివాదం నెలకొంది. తనకు రావాల్సిన ఆస్తి దక్కుతుందో లేదోనని గత నెల 27న పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు లక్సెట్టి పేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుని తల్లి కొమురక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
