ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల దాడి..

ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల దాడి..
ఐదుగురు అరెస్ట్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఐపీఎల్ మ్యాచ్‌లను ఆధారంగా చేసుకుని నిర్వహిస్తున్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై చిత్తూరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13వ తేదీ రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో చిత్తూరు 2 టౌన్ పోలీసులకు అందిన సమాచారంతో చర్యలు చేపట్టారు.
బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డులో మూసివేసిన శృతి మిల్క్ డైరీ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కొందరు వ్యక్తులు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య, ఎస్.ఐ రమేష్ బాబు, సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న నిందితులు పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా ఐదుగురిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన నిందితులపై 318(2), 61(2) Bీఎన్‌ఎస్ సెక్షన్లు, ఏపీ గేమింగ్ యాక్ట్ 3, 4, 7, 15 సెక్షన్లు, ఐటీ యాక్ట్ 66 కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో నిందితులు ఐపీఎల్ మ్యాచ్‌లపై ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో విక్రం రెడ్డి (30), వినోద్ కుమార్ అలియాస్ టైలర్ వినోద్ (39), రిజ్వాన్ (34), వంశీ కృష్ణ (34), అనీష్ అహ్మద్ (30) ఉన్నారు. వీరందరూ చిత్తూరు పట్టణానికి చెందిన వారే. ఇక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వినోద్, ఐశ్వర్యతో పాటు మనికంట, వేణు, భరత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజలకు హెచ్చరిక..
ఐపీఎల్ మ్యాచ్‌లు లేదా ఇతర క్రీడల పేరుతో జరుగుతున్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఎవరైనా ఈ విధమైన బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
